శర్మ దంతుర్తి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;శర్మ దంతుర్తి

కిరణ్ గారు
మీ పరిశోధన పేరులో “వస్తురూప వివేచన” అంటే ఏమిటి? దయచేసి కిందన ఇచ్చిన కృష్ణ మోహన రావుగారి రుబాయీకి వస్తురూప వివేచన చేసి వివరించగలరా?

(6) ప్రేమమ్మన జీవితమ్ము – ప్రేమించుటయే
ప్రేమమ్మన జీవితమ్ము – క్రీడించుటయే
ప్రేమమ్మొక రోజు కాదు – త్రేతాయుగమే
ప్రేమమ్మన నీవు నేను – రెండొక్కటియే

ఇందులో త్రేతాయుగం బదులు “సత్య యుగమే,” “ద్వాపర యుగమే,” “కలియుగమే,” మహాయుగమే,” అని మారిస్తే రుబాయీలో తేడా ఉంటుందా? లేదా ఆఖరి లైను “ప్రేమమ్మన మనిద్దరమొకటే’ అని రాస్తే అది రైటా తప్పా?

నాకు రుబాయీ అంటే తెలియదు కనక, తెలుగు అంత రాదు కనక అడుగుతున్నాను.

ధన్యవాదములు.


23 April 2024 9:50 PM

ఈమాట;శర్మ దంతుర్తి

అయ్యా
లింకులు ఇస్తే రిఫెరెన్స్ ఇచ్చినట్టా? కాదని నా పుస్తకాల పబ్లిషర్స్ ఎన్నో నెలలబట్టి చెప్తున్నారు. లింకులో ఇచ్చిన వ్యాసాలకీ, అందులో బొమ్మలకి వేరే కాపీరైట్ ఉంటుంది. రూల్స్ ప్రకారం పుస్తకాల, వ్యాసాల, బొమ్మల కాపీరైట్ రచయిత/ఆర్టిస్ట్ జీవితకాలం ప్లస్ మరో డబ్భై సంవత్సరాలు. వ్యాసం చివర్లో ఆయా బొమ్మలు వేసినవారివి అని చెప్పాల్సి ఉంటుంది. మీరు పబ్లిగ్గా ఊరికే ఇచ్చిన బొమ్మలు వాడినా వ్యాసం చివర్లో ఫలానా వ్యాసం మా రిఫరెన్స్ అని చెప్పడం మర్యాద. లింక్ ఇచ్చేసి అదే రిఫరెన్స్ అనుకోమనడం సరైనది కాదని నాకు పదే పదే చెప్పారు వేరు వేరు సంపాదకులు. ఆఖరికి మీరు మైక్రోసాఫ్ట్ విండోస్, ఆఫీస్ వారి స్క్రీన్ షాట్ వాడినా అవి ఫలానా అని చెప్పాల్సి ఉంటుంది మర్యాద కోసం. అవి అందరికీ తెల్సు, కావాలంటే లింకులో చూసుకుంటారో పోతారో మాకేల అనుకోవడం మంచిది కాదనుకుంటా.

నాకు తెల్సినది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. కాపీ రైట్ రూల్స్ ఇక్కడ.

.


05 April 2024 1:22 AM

ఈమాట;శర్మ దంతుర్తి

ఇందులో ఆఖరి పేరా తప్ప మిగతా వన్నీ చదవడానికి అంత గొప్పగా ఏమీ లేవు, దాదాపు అందరికీ తెల్సినవే. ఇచ్చిన టేబుల్, అంకెలూ ఎంతమంది చదువర్లకి అర్ధం అవుతాయన్నది వివాదాంశం. గ్రహణాలు ఎందుకొస్తాయనేది మూడో క్లాస్ కుర్రాడు కూడా చెప్పగలడు ఈ రోజుల్లో. ఈ విషయాలకన్నా గ్రహణ సమయంలో ఎందుకు వంటలు వండరు, తర్వాత స్నానం ఎందుకు చేస్తారు, ఈ సమయంలో చేసే మంత్ర జపం విశేషమైన ఫలితాలు ఇస్తుంది, గుళ్ళూ గోపురాలూ ఎందుకు మూసేస్తారు వగైరా “భారతదేశపు విషయాలు” చెప్తే బాగుండేది. ఈమాట తెలుగు పత్రిక కనక తెలుగు దేశంలో విషయాలు కూడా మరికొన్ని రాస్తే బాగుండేది. వ్యాసం బాగోలేదని అనడం లేదు కానీ చెప్పిన విషయాలు జగద్విదితం/అనవసరం.

ముఖ్యంగా ఈ బొమ్మలు, టేబిల్ ఎక్కడ నుంచి తెచ్చారు? రిఫరెన్స్‌లు ఇవ్వాలని రచయితకీ సంపాదకులకీ తోచకపొవడం శోచనీయం.

[వ్యాసంలోనే ఇచ్చిన లింకులు చూసి ఈ వ్యాఖ్య చేసి ఉండాల్సింది శర్మగారు. – సం.]


04 April 2024 9:54 PM

ఈమాట;శర్మ దంతుర్తి

చేరానేగానీ ఆక్సిజన్ పలచబడే ఆ ఉన్నత పరిసరాలు నా శక్తిమీదా నడకవేగం మీదా…

డాక్టర్‌గారూ అమరేంద్రగారూ: కీతో నగరపు పరిసర పట్టణాల్లోనూ ఎందుకు ఆక్సిజన్ పలచగా ఉంటుందో, ఆరోగ్యం చెడడానికి ఆస్కారం ఉందో (ఆస్థ్మా వారికీ వగైరా) కొంచెం వివరంగా చెప్తారనుకున్నా (పాత వ్యాసంలో చెప్పి ఉంటే తప్పునాదే, నేను అవి చదవలేదు). అనేకమంది వలసదారులు వచ్చే ఈ దారిలో చాలామందికి ఇక్కడే కాస్త ఆరోగ్యం చెడుతుంది, వీళ్ళకి ముందు ఈ విషయాలు మధ్యవర్తులూ, ఏజెంట్లూ చెప్పరు, చెప్పినా పట్టించుకోరు అని టైమ్ పత్రికలో రాసారు ఒక వ్యాసంలో. ఈ ఆక్సిజన్ విషయాలు గూగుల్లో దొరుకుతాయనుకోండి కానీ డాక్టర్ గారు చెప్పడం వేరు కదా? 🙂


04 April 2024 9:38 PM

ఈమాట;శర్మ దంతుర్తి

>> కాలకర్మంబులను మీరఁ గాదు తరము

ఉగాది, ఆ తర్వాత సంవత్సరం ఎలా ఉంటాయో కానీ ఈ వాక్యం మాత్రం, “final nail in the coffin.” గీతాచార్యుడు చెప్పినట్టే “కాల: కలయతామహం.” దీనికి స్వామి ప్రభుపాద గారు ఇచ్చిన అనువాదం – among subduers, I am Time. (విభూతి యోగం 30)


04 April 2024 9:26 PM